Sam Pitroda: ఓవర్సీస్‌ ఛైర్మన్‌గా శామ్‌ పిట్రోడా పునర్నియామకం

కాంగ్రెస్‌ పార్టీ శామ్‌ పిట్రోడాను ఓవర్సీస్‌ ఛైర్మన్‌గా తిరిగి నియమించింది. ఈ విషయాన్ని హస్తం పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

Published : 26 Jun 2024 23:05 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ (Congress) ఓవర్సీస్‌ ఛైర్మన్‌గా శామ్‌పిట్రోడా (Sam Pitroda) తిరిగి నియమితులయ్యారు. హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను తిరిగి నియమించారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్‌ నేత కేసీ వేణు గోపాల్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. 

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా వారసత్వ పన్ను విధానంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ఓ విధానాన్ని ఉటంకిస్తూ.. ‘‘ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సొత్తు ఉందనుకుంటే.. ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

జీరో FIR, ఆన్‌లైన్‌ ఫిర్యాదులు.. జులై 1 నుంచే కొత్త చట్టాలు!

ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. తాజాను ఆయనను తిరిగి అదే పదవిలో నియమించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు