NEET: ఆ విద్యార్థులకు 23న మళ్లీ ‘నీట్‌’.. ఫలితాలు ఎప్పుడంటే?

గ్రేస్‌ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ నీట్‌ పరీక్ష నిర్వహించేందుకు ఎన్‌టీఏ షెడ్యూల్‌ ఖరారు చేసింది.

Updated : 13 Jun 2024 23:22 IST

దిల్లీ: వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)లో అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్‌ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థులకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) షెడ్యూల్‌ని ఖరారు చేసింది. జూన్‌ 23న ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.20గంటల వరకు పరీక్ష జరగనుంది. ఫలితాలను జూన్‌ 30న విడుదల చేసే అవకాశం ఉందని ఎన్‌టీఏ సీనియర్‌ డైరెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

నీట్‌ వ్యవహారం.. ‘సుప్రీం’ పర్యవేక్షణలో దర్యాప్తు చేయండి: ఖర్గే డిమాండ్‌

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ అయిందని, ఈ పరీక్షలో అక్రమాలతో దేశ వ్యాప్తంగా మే 5న పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిత ప్రమాదంలో పడిందంటూ కాంగ్రెస్‌ సహా పలు విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. ప్రశ్నపత్రం లీకైనట్లు ఎక్కడా ఆధారాల్లేవన్నారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని