Sanjay Singh: ఆప్ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్‌గా సంజయ్ సింగ్

ఆమ్ఆద్మీ పార్టీ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్‌గా ఆప్ సంజయ్ సింగ్‌ను నియమించింది.

Published : 05 Jul 2024 16:34 IST

దిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ (AAP) సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ (Sanjay Singh)ను ఆప్ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్‌గా ఆ పార్టీ నియమించింది. సంజయ్‌ సింగ్‌ 2018లో తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయనను ఆప్‌ రెండో దఫా ఎంపీగా పంపింది. పార్టీ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన వారు పార్టీ ఎంపీలకు నాయకత్వం వహించాల్సి ఉంటుంది. 

ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో సంజయ్‌ సింగ్‌ పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఎన్డీయే ప్రభుత్వం తమపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమను వంద ముక్కలు చేసినా కేంద్రం ముందు తలవంచబోమని పేర్కొన్నారు.

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సంజయ్ సింగ్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. సుప్రీంకోర్టు ఏప్రిల్‌లో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆప్‌ అధినేత కేజ్రీవాల్ జైల్లో ఉన్నందున పార్టీ కార్యకలాపాలను సంజయ్‌సింగ్‌ పర్యవేక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని