Mumbai Rains: ‘దుమ్మురేపిన’ గాలివాన.. ముంబయిలో మెట్రో, సబ్‌అర్బన్‌ సర్వీసులకు అంతరాయం

ముంబయిలో పలు ప్రాంతాల్లో వర్షంతోపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మెట్రోతోపాటు లోకల్‌ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది.

Published : 13 May 2024 18:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్నిరోజులుగా వేడితో సతమతమవుతోన్న ముంబయిని ఈ సీజన్‌లో తొలి వర్షం పలకరించింది. అయితే, నగరంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షంతోపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కొన్నిచోట్ల తీవ్ర స్థాయిలో దుమ్మురేగింది. బలమైన గాలులకు హోర్డింగులు విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల వైర్లు తెగిపడ్డాయి. దీంతో మెట్రోతోపాటు లోకల్‌ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. ఠాణె, పాల్ఘర్‌, ముంబయి ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం

దాదర్‌, కుర్లా, మాహిమ్‌, ఘాట్‌కోపర్‌, ములుండ్‌, విఖ్రోలితోపాటు దక్షిణ ముంబయిలో కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతోపాటు, బలమైన గాలులు వీచాయి. కొన్నిచోట్ల దట్టమైన దుమ్ము ఎగిసిపడింది. భవనాలపై ఉన్న హోర్డింగులు కూలిపోయాయి. అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో పలు మార్గాల్లో మెట్రో సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. సబ్‌అర్బన్‌ రైళ్లకూ అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల విద్యుత్తును నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని