Railways: రైళ్ల టైమ్‌ టేబుల్‌ యథాతథం.. డిసెంబర్‌ 31వరకు పాతదే వర్తింపు

రైళ్ల రాకపోకలకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ వివరాల్లో ఎటువంటి మార్పు లేదని.. డిసెంబర్‌ 31, 2024 వరకు ప్రస్తుతమున్న కాలపట్టికే కొనసాగుతుందని భారతీయ రైల్వే వెల్లడించింది.

Published : 01 Jul 2024 19:59 IST

దిల్లీ: రైళ్ల రాకపోకలకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ వివరాల్లో ఎటువంటి మార్పు లేదని భారతీయ రైల్వే వెల్లడించింది. డిసెంబర్‌ 31, 2024 వరకు ప్రస్తుతమున్న కాలపట్టికే కొనసాగుతుందని తెలిపింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ అన్ని రైల్వే జోన్లు సర్క్యులర్‌లు జారీ చేయనున్నట్లు రైల్వే బోర్డు పేర్కొంది.

‘‘రైళ్ల సమయాలు, వాటి ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తున్నాం. కొత్త కాలపట్టికను మరింత సౌలభ్యంగా రూపొందించాలని బోర్డు భావిస్తున్నందున జనవరి 1, 2025 వరకు పాత పట్టికే ఉంటుంది’’ అని రైల్వే బోర్డు వెల్లడిచింది.

రైళ్ల రాకపోకల సమయాలను తెలియజేస్తూ భారతీయ రైల్వే ఏటా ‘ట్రెయిన్స్‌ ఎట్‌ గ్లాన్స్‌’ (TAG) పేరుతో ఓ టైమ్‌ టైబుల్‌ విడుదల చేస్తుంది. జులై 1 నుంచి వచ్చే జులై 31 వరకు అమల్లో ఉండేలా దీన్ని రూపొందిస్తుంది. తాజాగా ఈ పట్టిక గడువును పొడిగించడంతో అన్ని జోన్లు సర్క్యులర్‌లు జారీ చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని