Rahul Gandhi: ‘ఇక నేను పెళ్లి చేసుకోవాలి’: రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఆయన ఏమని సమాధానం ఇచ్చారంటే..?

Published : 13 May 2024 20:24 IST

రాయ్‌బరేలీ: తన లోక్‌సభ నియోజకవర్గం రాయ్‌బరేలీ (Raebareli)లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈసందర్భంగా ఆయన పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఆడియన్స్‌ అడిగిన ప్రశ్నకు ఈసారి ఆసక్తికరంగా స్పందించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో రాహుల్ సోమవారం బహిరంగ సభలో పాల్గొన్నారు. వివాహం గురించి అడగ్గా.. ‘‘ఇప్పుడిక త్వరలో నేను పెళ్లి చేసుకోవాలి’’ అని బదులిచ్చారు. దాంతో అక్కడే ఉన్న సోదరి ప్రియాంకాగాంధీ సహా మిగిలిన వారు చిరునవ్వులు చిందించారు. గతంలోనూ ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. గతేడాది రాజస్థాన్‌లోని మహారాణి కళాశాల విద్యార్థినులు ఆయనతో మాట్లాడుతూ..‘‘మీరు స్మార్ట్‌గా, అందంగా ఉంటారు. పెళ్లి గురించి ఎందుకు ఆలోచించలేదు?’’ అని అడిగారు. తన పనుల్లో, పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమైనందునే వివాహం వైపు వెళ్లలేదని వారికి సమాధానం ఇచ్చారు.

PM Modi: ‘ఆ నోట్ల గుట్టలకు 70 ట్రక్కులు కావాలి’: ఈడీ సోదాలపై మోదీ కీలక వ్యాఖ్య

ఇదిలాఉంటే.. తన తల్లి సోనియాగాంధీ రెండు దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తోన్న రాయ్‌బరేలీ నుంచి ఈసారి రాహుల్ బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో సోనియా చేతిలో ఓడిపోయిన దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌నే మరోసారి భాజపా అక్కడ బరిలోకి దించింది. మే 20న ఇక్కడ పోలింగ్ జరగనుంది. 2004 నుంచి అమేఠీకి ప్రాతినిధ్యం వహించిన రాహుల్‌..  2019లో భాజపా అభ్యర్థి స్మృతిఇరానీ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్నారు. అక్కడే మరోసారి పోటీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని