Priyanka Gandhi: రాహుల్‌ దాడి భాజపాపై మాత్రమే: ప్రియాంక గాంధీ

రాహుల్‌ గాంధీ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని భాజపా చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కొట్టిపడేశారు.

Published : 01 Jul 2024 18:39 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభలో హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని భాజపా ఆరోపించింది. రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)  స్పందిస్తూ రాహుల్‌కు మద్దతుగా నిలిచారు. తన సోదరుడు రాహుల్‌ గాంధీ ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరని, ఆ విషయాన్ని సభలో రాహుల్‌ స్పష్టంగా తెలియజేశారన్నారు. లోక్‌సభలో కేవలం భాజపా(BJP) గురించి, ఆ పార్టీ నాయకుల గురించి మాట్లాడారని ఆమె పేర్కొన్నారు.

సోమవారం జరిగిన లోక్‌సభలో రాహుల్‌ కొన్ని మతపరమైన ఫొటోలను చూపించారు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్‌ ఓం బిర్లా వారించారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలగజేసుకుని రాహుల్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా రాహుల్‌ పేర్కొనడం ఆమోదనీయం కాదని దుయ్యబట్టారు. అయితే.. తాను భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని.. ఆ పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్‌ తెలిపారు. అన్ని మతాలు ధైర్యం, నిర్భయత, అహింస సందేశాలను చాటి చెబుతున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని