Anant Ambani Wedding: మెరిసిన రాధికా మర్చెంట్‌.. హల్దీ వేడుకల ఫొటోలు వైరల్‌

అంబానీ ఇంట హల్దీ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రాధిక మర్చెంట్‌ ధరించిన పూల దుపట్టా ఆకర్షణగా నిలిచింది.

Updated : 10 Jul 2024 11:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) ఇంట పెళ్లి సందడి అంబరాన్నంటుతోంది. మరికొన్ని రోజుల్లో అనంత్‌- రాధికా మర్చెంట్‌ (Anant Ambani Wedding) వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అంబానీ ఇంట జరుగుతున్న ఈ శుభకార్యంపై అందరికీ ఆసక్తే. సోమవారం హల్దీ వేడుక ఘనంగా జరిగింది. ఇందులో రాధికా ధరించిన పసుపు రంగు లెహంగాపై పూల దుపట్టా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ దుపట్టాలో రాధికా మర్చెంట్‌ మెరిసిపోయారు. స్టైలిస్ట్‌ రియా కపూర్‌, డిజైనర్‌ అనామికా ఖన్నా వేడుక కోసం ఈ దుపట్టాను డిజైన్‌ చేశారు. హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఆకట్టుకొన్న దుస్తులు

ఇటీవల అనంత్‌ అంబానీ- రాధికా మర్చెంట్‌ జంటకు ఫొటో షూట్‌ జరిగింది. వీరిద్దరు ధరించిన దుస్తులు ఆకట్టుకుంటున్నాయి. రాధికా నుదుటిపై అనంత్‌ ముద్దు పెడుతున్న ఫొటో వైరల్‌గా మారింది. కాగా.. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జులై 12న అనంత్‌- రాధికా మర్చెంట్‌ వివాహంతో ఒక్కటి కానున్నారు. ఈ జంట నిశ్చితార్థం మొదలు.. ప్రతి వేడుకా అందరినీ ఆకట్టుకుంటోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు