Neet row: నీట్-పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా

జూన్‌ 23న దేశవ్యాప్తంగా జరగాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది.

Updated : 22 Jun 2024 22:36 IST

దిల్లీ: జూన్‌ 23న దేశవ్యాప్తంగా జరగాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

ఎన్‌టీఏ డీజీపై వేటు..

యూజీసీ నెట్‌, నీట్‌- యూజీ పరీక్షల నిర్వహణ విషయంలో ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)’ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల నడుమ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్ ఆ పదవి నుంచి తొలగించింది. భారత వాణిజ్య ప్రచార సంస్థ (ఐటీపీఓ) ఛైర్మన్‌, ఎండీ ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాకు ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సుబోధ్‌ను కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు