Jairam Ramesh: మణిపుర్‌ సమస్య మోదీ సర్కార్‌కు పట్టడం లేదు: జైరాం రమేశ్‌

మణిపుర్‌ పరిస్థితిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. 

Published : 30 Jun 2024 20:42 IST

దిల్లీ: జాతుల మధ్య వైరంతో మణిపుర్‌ (Manipur)లో అల్లకల్లోల పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యపై ప్రధాని (PM Modi) స్పందించకపోవడంపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. ఆ ప్రాంత ప్రజలను పట్టించుకోవడం లేదని మోదీ సర్కార్‌పై హస్తం పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) నిప్పులు చెరిగారు. అన్నింటికీ సమయం ఉంటుంది కానీ మణిపుర్‌ను సందర్శించేందుకు ప్రధానికి తీరిక దొరకడం లేదని విమర్శించారు.

‘‘గతేడాది ఇదే సమయానికి ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ సీఎం బిరేన్‌ సింగ్‌ రాజీనామాపై పెద్ద డ్రామా జరిగింది. నాటి నుంచి నేటి వరకు అక్కడి ప్రజలు అనుభవిస్తున్న వేదన కేంద్రానికి పట్టడం లేదు. అనేక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ప్రధానికి సమయం దొరుకుతుంది. కానీ, నిత్యం సమస్యలను ఎదుర్కొంటున్న మణిపుర్‌ను సందర్శించేందుకు తీరిక లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. కనీసం ఆ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యేందుకు సిద్ధంగా లేరు’’ అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఆరోపించారు.

ఆ పార్టీ ఎంపీకే ‘డిప్యూటీ’ ఇవ్వండి.. టీఎంసీ విజ్ఞప్తి

కాగా.. గతేడాది మే నెలలో మణిపుర్‌లోని కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు 225 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది ఇప్పటికీ సహాయ కేంద్రాలలో తలదాచుకుంటున్నారు. రాష్ట్రంలో ఘర్షణలు మొదలై ఏడాది గడుస్తున్న సమస్యను పరిష్కరించకపోవడంతో ప్రతిపక్షాలు మోదీ సర్కార్‌పై మండిపడుతున్నాయి. అక్కడ శాంతి నెలకొనేలా చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని