Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్ర షురూ.. తొలిరోజు 13 వేలమంది దర్శనం

అమర్‌నాథ్‌ యాత్ర తొలిరోజు 13 వేలమందికిపైగా యాత్రికులు మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Published : 29 Jun 2024 22:23 IST

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్‌లో ఏటా వైభవంగా నిర్వహించే పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra) పకడ్బందీ భద్రత నడుమ శనివారం ప్రారంభమైంది. తెల్లవారుజామునే బాల్టాల్, నున్‌వాన్‌లోని బేస్ క్యాంపుల నుంచి యాత్రికులు హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ గుహకు బయల్దేరి వెళ్లారు. తొలిరోజు 13 వేలమందికిపైగా భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తదితరులు యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్రానికి నీతీశ్ కుమార్‌ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం

ఇటీవల జమ్మూ ప్రాంతంలో ఉగ్రదాడుల నేపథ్యంలో యాత్ర సాగే మార్గంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్‌, ఐటీబీపీ ఇతర పారామిలిటరీ బలగాలను మోహరించారు. మరోవైపు కేంద్రప్రభుత్వ సంస్థ ‘ఓఎన్‌జీసీ’.. కశ్మీర్‌లోని రెండు బేస్‌ క్యాంపుల్లో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేసింది. యాత్ర అనంతరం కూడా వైద్య సేవలు కొనసాగుతాయని వెల్లడించింది. అనంతనాగ్‌ జిల్లాలోని రెండు మార్గాల్లో ఆగస్టు 19 వరకు 52 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని