Amarnath Yatra: 13వేల మందికిపైగా భక్తుల అమర్‌నాథ్‌ ఆలయ సందర్శన

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైన తొలి రోజున 13వేల మందికిపైగా భక్తులు గుహాలయాన్ని సందర్శించారు. అంతకుముందు శనివారం తెల్లవారు జామున గట్టి బందోబస్తు మధ్య కశ్మీర్‌లోని జంట బేస్‌ క్యాంపులైన బాల్టాల్, నున్వాన్‌ల నుంచి మొదటి బ్యాచ్‌ యాత్రికులు బయలుదేరారు.

Published : 30 Jun 2024 05:39 IST

శ్రీనగర్‌: అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైన తొలి రోజున 13వేల మందికిపైగా భక్తులు గుహాలయాన్ని సందర్శించారు. అంతకుముందు శనివారం తెల్లవారు జామున గట్టి బందోబస్తు మధ్య కశ్మీర్‌లోని జంట బేస్‌ క్యాంపులైన బాల్టాల్, నున్వాన్‌ల నుంచి మొదటి బ్యాచ్‌ యాత్రికులు బయలుదేరారు. వారంతా నడక మార్గంలో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ గుహాలయాన్ని చేరుకున్నారు. మరోవైపు, జమ్మూలోని భగవతినగర్‌ బేస్‌ క్యాంపు నుంచి 1,881 మంది యాత్రికులతో కూడిన రెండవ బ్యాచ్‌ జంట బేస్‌ క్యాంపులకు శనివారం బయలుదేరింది. వీరిలో 427 మంది మహిళలు, 294 మంది సాధువులున్నారని అధికారులు తెలిపారు. అమర్‌నాథ్‌ యాత్రికులకు ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బాబా బర్ఫానీ (మంచు శివలింగం)ని దర్శించుకున్న భక్తులందరికీ శివుడు అపారమైన శక్తి అందిస్తారని పేర్కొన్నారు. భక్తుల ప్రయాణం సురక్షితంగా, ఆహ్లాదకరంగా సాగేందుకు మోదీ ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. కశ్మీర్‌లోని జంట బేస్‌ క్యాంపుల వద్ద 100 పడకల ఆస్పత్రులను రెండింటిని నెలకొల్పినట్లు ఓఎన్‌జీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవి తాత్కాలిక ఆస్పత్రులు కాదని, యాత్ర అనంతరం వీటిలో ఇక్కడి ప్రజలకు వైద్య సేవలు కొనసాగుతాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని