Students Protest: ఎన్‌టీఏ ఆఫీసులోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు.. దిల్లీలో ఉద్రిక్తత

Students Protest: దిల్లీలోని జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులు దూసుకెళ్లారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Published : 27 Jun 2024 17:28 IST

దిల్లీ: యూజీసీ నెట్‌ (UGC NET), నీట్‌ పీజీ (NEET UG) వంటి పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమాలకు (NEET Row) వ్యతిరేకంగా పలు విద్యార్థి సంఘాల నాయకులు దేశ రాజధాని దిల్లీలో ఆందోళన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారిలో కొందరు గురువారం ఎన్‌టీఏ ఆఫీసులోకి దూసుకెళ్లడం గమనార్హం.

నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా- ఎన్‌ఎస్‌యూఐ సంఘానికి చెందిన దాదాపు 100 మంది ఆందోళనకారులు (Students Protest) ఈ సాయంత్రం ఎన్‌టీఏ ఆఫీసు భవనంలోకి దూసుకెళ్లారు. అనంతరం వారు లోపలి నుంచి లాక్‌ చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఎన్‌టీఏ ఆఫీసు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు కార్యాలయం లోపలికి పరిగెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని