NEET PG 2024: నీట్‌ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ క్లారిటీ

నీట్‌ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ క్లారిటీ ఇచ్చారు.

Published : 29 Jun 2024 20:35 IST

దిల్లీ: నీట్‌ యూజీ-2024 (NEET UG 2024) పరీక్ష లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొన్న నేపథ్యంలో నీట్‌ పీజీ 2024 (NEET PG 2024) పరీక్ష నిర్వహణను కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తిరిగి ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan) స్పందించారు. జులై 1 లేదా 2 తేదీల్లో రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముందన్నారు. దిల్లీలో (Delhi) నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నీట్‌ పరీక్షల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో ఇప్పటికే కొత్త అధికారులు చేరారు. మరోవైపు పరీక్ష పేపర్‌ లీకేజీపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఎన్‌టీఏ సంస్కరణల కోసం ఇస్రో మాజీ ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశాం. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాం. అంతేకాకుండా భవిష్యత్‌లో ఈ తరహా నేరాలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నాం’’ అని తెలిపారు.

నీట్‌ పరీక్షపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని ధర్మేంద్ర విమర్శించారు. ‘‘ నీట్‌ అంశంపై చర్చించాలని కాంగ్రెస్‌ కోరుకోవడం లేదు. వాళ్లంతా తప్పించుకోవాలని చూస్తున్నారు. విద్యార్థుల సమస్యలపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని ప్రభుత్వం తరఫున నేను ప్రకటించా. కానీ, కాంగ్రెస్‌ మాత్రం విద్యార్థుల బాగోగులు తప్ప.. నీట్‌ పేరుతో మిగతా అంశాలపై రాద్ధాంతం చేయాలనుకుంటోంది’’ అని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని