Mukesh Ambani: మహారాష్ట్ర సీఎం నివాసానికి ముకేశ్‌ అంబానీ..

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్‌ అంబానీ బుధవారం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందేను కలిశారు.

Published : 26 Jun 2024 14:45 IST

ముంబయి: రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani)  బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde)ను ఆయన నివాసంలో కలిశారు. జులై 12న జరగనున్న తన కుమారుడు అనంత్‌ అంబానీ(Anant Ambani) వివాహానికి హాజరుకావాలని ముకేశ్‌ సీఎంను ఆహ్వానించారు. ఆయనతో పాటు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్(Radhika Merchant)  శిందేను కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన సీఎం కుటుంబసభ్యులు రాధికా మర్చంట్‌కు వినాయకుడి ప్రతిమను బహూకరించారు.

కాగా అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ సోమవారం ముంబయిలోని అజయ్ దేవగన్(Ajay Devgn) ఇంటికి వెళ్లి తమ వివాహానికి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ(Nita Ambani) కాశీ విశ్వనాథుడిని దర్శించి తొలి వివాహ ఆహ్వాన పత్రిక సమర్పించి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘మన సంప్రదాయం ప్రకారం ముందుగా భగవంతుడి ఆశీస్సులు తీసుకుంటాము. భగవంతుడికి వివాహ ఆహ్వాన పత్రికను సమర్పించాను. 10 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కాశీ విశ్వనాథ్ కారిడార్, నమో ఘాట్, సోలార్ ఎనర్జీ ప్లాంట్లు, పరిశుభ్రతను చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ల వివాహం జులై 12న ముంబయిలోని జియో(Jio) వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. 2022లో రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో వీరి నిశ్చితార్థం జరగ్గా ఇటీవల మార్చి 1 నుంచి 3 వరకు జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు