Kedarnath: కేదార్‌నాథ్‌లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్‌

‘కేదార్‌నాథ్‌ ధామ్‌’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 01 Jul 2024 00:13 IST

కేదార్‌నాథ్: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘కేదార్‌నాథ్‌ ధామ్‌ (Kedarnath Dham)’ సమీపంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కేదార్‌నాథ్‌ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల ఎగువన ఉన్న గాంధీ సరోవర్‌పై ఆదివారం మంచు ఉప్పెన (Avalanche) విరుచుకుపడింది. చోరాబరి హిమానీనదంలోని గాంధీ సరోవర్‌ ఎగువ ప్రాంతం నుంచి పెద్దమొత్తంలో మంచు కిందికి దూసుకొస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆలయ సందర్శనకు వెళ్లిన భక్తులు ఇదంతా తమ ఫోన్‌లలో చిత్రీకరించారు.

‘అమ్మ పేరుతో ఒక మొక్క’.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్‌వార్ తెలిపారు. కేదార్‌నాథ్ సహా మొత్తం ప్రాంతం సురక్షితంగా ఉందని చెప్పారు. గత ఏడాది సైతం ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. దీంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, వాడియా ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో సర్వేలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. హిమాలయ ప్రాంతంలో ఇటువంటివి సాధారణమేనని తెలిపారు. అయితే, కేదార్‌నాథ్ ధామ్ ప్రాంతంలో భద్రతను మెరుగుపరచాలని సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని