- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Viral post: కంపెనీలో వాటా ఇస్తే ఉద్యోగం మానేస్తా: భర్తకు కండీషన్ పెట్టిన భార్య
ఇటీవల ఓ మహిళ సామాజిక మాధ్యమం రెడిట్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఎంతోమంది మహిళలు తమ పిల్ల్లల భవిష్యత్తు కోసం వారు ఎంతో కష్టపడి సంపాదించుకొన్న ఉద్యోగాన్ని వదులుకొని ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇటువంటి సందర్భాన్ని ఎదుర్కొన్న ఓ మహిళ సోషల్ మీడియా రెడిట్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఉద్యోగం వదిలిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి అన్న విషయాలను నెటిజన్లతో పంచుకున్నారు.
ఆమె తన పోస్ట్‌లో ‘‘నా భర్త, నేను వివాహం చేసుకుని 6 ఏళ్లు అయ్యింది. మాకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం నేను గర్భిణిని. పిల్లల బాగోగులు చూసుకోవాలంటే నేను ఉద్యోగం మానేసి పిల్లలను చూసుకొమ్మని మా ఆయన అన్నారు. ఆ మాటతో మానసికంగా కుంగిపోయాను. ఎంతో కష్టపడి సంపాదించిన ఉద్యోగం. ఇప్పుడు ఉద్యోగాన్ని వదులుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ భవిష్యత్తులో అనుకోని పరిస్థితుల్లో మేము విడాకులు తీసుకోవాల్సివస్తే అప్పుడు నాకు ఏ ఆధారమూ ఉండదు.
అందుకే ఈ విషయంలో బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. నా భర్త కంపెనీలో సగం వాటాను నాకు ఇస్తే ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో ఆయన ఆశ్చర్యపోయారు. నా స్నేహితులకు ఈ విషయం చెప్పినప్పుడు భర్తతో ఈవిధంగా ప్రవర్తిస్తావా.. ఇదేం పిచ్చి ప్రవర్తన? అంటూ మందలించారు. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? సరైన దారిలోనే వెళ్తున్నానా? అని తేల్చుకోలేకపోతున్నాను. నాకు మీ సలహా కావాలి’’ అంటూ నెటిజన్లను కోరారు.
దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలిపారు. మరికొందరు పిల్లల బాధ్యతను తల్లి చూసుకోవాలంటే ఇటువంటివి తప్పవు అంటూ హితవు పలికారు. ఓ నెటిజన్ స్పందిస్తూ ‘‘ ఆర్థిక భరోసా, సురక్షితమైన భవిష్యత్తు మీ ఆయనకు ఎలాగైతే ముఖ్యమో, మీకు కూడా అంతే అవసరం. ఆయన ఇంట్లో తన బాధ్యతలను కూడా మీపై వేయాలని చూస్తున్నారు. మీరు వాటా అడగడం మంచిదే’’ అంటూ రాసుకొచ్చారు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘‘మీరు తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఎందుకంటే మీరు భయపడుతున్నట్లుగా భవిష్యత్తులో జరగకూడనిది జరిగితే మీకంటూ ఒక ఆధారం ఉంటుంది. మీ భర్త మీకు విడాకులు ఇచ్చినా మీరు భరణం కోసం ఆయనను వేడుకోవాల్సిన అవసరం ఉండదు’’ అని తెలిపారు. అనంతరం ఆమె మరో పోస్ట్‌లో తన భర్త తన భవిష్యత్తుకు భరోసా ఇస్తూ కంపెనీలో 49% వాటా ఇచ్చారని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
16ఏళ్లు ఎదురు చూశాం.. ప్రాణాల కోసం నిమిషాలు ఓపిక పట్టలేమా..పోస్ట్ వైరల్
ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం దేశం మొత్తం ప్రపంచ కప్పు ఫీవర్‌లో ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాల ట్రాఫిక్ పోలీసులు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి. -
ఉత్తర భారతంలో భారీవర్షాలు
ఉత్తర భారతంలో శనివారం పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. -
విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదు : సీబీఐ
మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (55) విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. -
నీట్ కేసు.. గుజరాత్లో ఏడుచోట్ల సీబీఐ సోదాలు
వైద్యవిద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష’ (నీట్-యూజీ) అక్రమాలకు సంబంధించి గుజరాత్లో ఏడుచోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం సోదాలు నిర్వహించింది. -
కూలిన రాజ్‌కోట్ విమానాశ్రయ పైకప్పు
భారీవర్షాలకు దిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలిన 24 గంటల్లోనే గుజరాత్‌లోని రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అటువంటి సంఘటనే మరొకటి నమోదైంది. విమానాశ్రయ పైకప్పులో ఓ భాగం శనివారం ఊడిపడిపోయింది. -
లద్దాఖ్‌లో నది దాటుతూ ఐదుగురు సైనికుల దుర్మరణం
ఓ నదిని దాటే ప్రయత్నంలో యుద్ధ ట్యాంకులోని ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో శనివారం చోటుచేసుకుంది. -
ప్రభుత్వాన్ని నియంత్రించేది రాజ్యాంగ నైతికతే
రాజ్యాంగ నైతికత ప్రభుత్వాన్ని నియంత్రించే కారకంగా పనిచేస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. భిన్నత్వాన్ని గౌరవించడం, అందరినీ కలుపుకొనిపోవడాన్ని ప్రోత్సహించడం, సహనాన్ని కొనసాగించడం వంటి షరతులు ఇందులో ఇమిడి ఉన్నాయని వివరించారు. -
బ్రీత్ ఎనలైజర్లపై పకడ్బందీ నిబంధనలు
శ్వాస విశ్లేషణ సాధనాలు (బ్రీత్ ఎనలైజర్స్) కచ్చితమైన, విశ్వసనీయమైన ఫలితాలను అందించేలా చూడటానికి కేంద్ర వినియోగదారుల శాఖకు చెందిన చట్టపరమైన తూనికలు, కొలతల విభాగం శుక్రవారం కొత్త ముసాయిదా నిబంధనలను వెలువరించింది. -
ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ
బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని జనతాదళ్ (యునైటెడ్) డిమాండ్ చేసింది. పేరు ఏదైనా తమ రాష్ట్రానికి సాయం కావాలని పేర్కొంది. ఈ మేరకు శనివారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. -
13వేల మందికిపైగా భక్తుల అమర్నాథ్ ఆలయ సందర్శన
అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి రోజున 13వేల మందికిపైగా భక్తులు గుహాలయాన్ని సందర్శించారు. అంతకుముందు శనివారం తెల్లవారు జామున గట్టి బందోబస్తు మధ్య కశ్మీర్‌లోని జంట బేస్ క్యాంపులైన బాల్టాల్, నున్వాన్‌ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. -
ఏఐతో గొంతు మార్చి.. పురుషుడిలా మాట్లాడిన మహిళ
కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఓ మహిళ పురుషుడిలా గొంతు మార్చి ఓ యువతి నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఠాణెకు చెందిన ఓ మహిళ ఏఐ సాయంతో పురుషుడిలా తన పొరుగింటి యువతికి ఫోన్ చేసింది. -
‘డేటింగ్ యాప్’తో.. ఘరానా మోసం
సివిల్స్‌కి సిద్ధమవుతున్న ఓ యువకుడు ‘డేటింగ్ యాప్’ల మాయలో పడి రూ.1.2 లక్షలు కోల్పోయిన సంఘటన దిల్లీలో చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దాని వెనకున్న ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. -
ఎమర్జెన్సీపై ఓంబిర్లా వ్యాఖ్యలు సరికాదు
‘ఎమర్జెన్సీ’ అంశంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ స్పందించారు. -
ఎమర్జెన్సీలో జైల్లో వేసినా.. దేశద్రోహి అనలేదు: లాలూ
దాదాపు 50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఇటీవల రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ అత్యయిక పరిస్థితిని ఉద్దేశించి ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. -
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి 40% ప్రమాదభత్యం : అమిత్ షా
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) చేపట్టే కీలకమైన ఆపరేషన్లను దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి 40 శాతం ప్రమాద భత్యాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు బైడెన్, ట్రంప్ మధ్య జరిగిన తొలి చర్చకు సంబంధించి అందరూ అంగీకరిస్తున్నది ఒక్కటే.. ట్రంప్ ముందు బైడెన్ తేలిపోయారని. అయితే బైడెన్ తాను చెప్పాలనుకున్న ముఖ్య విషయాలను స్పష్టంగానే వివరించారు. -
మీ భర్తలను ఇంట్లో కూర్చొని తాగమనండి.. మహిళలకు మధ్యప్రదేశ్ మంత్రి సలహా
పురుషులతో మద్యం మాన్పించేందుకు మధ్యప్రదేశ్ సామాజిక న్యాయశాఖ మంత్రి నారాయణసింగ్ కుశ్వాహా మహిళలకు ఇచ్చిన సూచన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
సంక్షిప్త వార్తలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో నమోదైన పరువు నష్టం కేసు విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది. -
కల్తీసారా విక్రయాలపై తమిళనాడు ఉక్కుపాదం
ఇటీవల తమిళనాడులో కల్తీసారా బారిన పడి 60 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
అనూహ్య వరద.. కొట్టుకుపోయిన కార్లు!
హరిద్వార్‌లోని సుఖీ నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో.. పలు కార్లు, బస్సులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పైసా వసూల్.. మ్యాచ్‌లో ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
-
‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్ హాసన్ అందుకే నటించలేదు.. కారణాలివే
-
16ఏళ్లు ఎదురు చూశాం.. ప్రాణాల కోసం నిమిషాలు ఓపిక పట్టలేమా..పోస్ట్ వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వెంకయ్యనాయుడి వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ
-
డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి