RajyaSabha: ఖర్గే స్థానంలో ‘ఆయన’ ఉంటే బాగుంటుంది.. రాజ్యసభ ఛైర్మన్‌

రాజ్యసభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీరుపై ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మండిపడ్డారు. జగదీప్‌వ్యాఖ్యలకు బదులిస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలతో సభ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Published : 02 Jul 2024 17:37 IST

దిల్లీ: రాజ్యసభలో మరోసారి వాడీవేడీ వాతావరణం నెలకొంది. ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar), కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ల మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగింది. ఖర్గే వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టిన ధన్‌ఖడ్‌.. ఛైర్మన్‌ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే స్థానంలో జైరాం రమేశ్‌ కూర్చుంటే బాగుంటుందన్నారు.

‘‘ఛైర్మన్‌ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పార్లమెంట్‌ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. సమావేశం మధ్యలో తరచూ లేచి మీకు తోచింది మాట్లాడుతున్నారు. అయినా.. మీ గౌరవాన్ని కాపాడేందుకు చాలా ప్రయత్నించా’’ అని ఖర్గేపై మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఏదో చెప్పడానికి లేచి నిలబడితే ఛైర్మన్‌ ఆయన్ను వారించారు.

ఖర్గే స్థానంలో కూర్చోండి..

‘‘మీరు చాలా తెలివైనవారు. ప్రతిభావంతులు. ఖర్గే చేయాల్సిన పని మీరు చేస్తున్నారు. వచ్చి ఆయన స్థానంలో కూర్చోండి’’ అని ధన్‌ఖడ్‌ సూచించారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ స్థానం కల్పించారు. బాధ్యతలు అప్పగించారు. ఆమె వల్లే నేను ఇక్కడ కూర్చున్నా’’ అని బదులిచ్చారు.’’ అని కాంగ్రెస్‌ నేత చేసిన వ్యాఖ్యలతో సభ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

‘రాహుల్ గాంధీలా ప్రవర్తించకండి’.. ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన

కాగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించే ముందు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు ఓ విజ్ఞప్తి చేశారు.  మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువసేపు నిలబడి ఉండలేకపోతున్నానని.. ఛైర్మన్ అనుమతిస్తే కూర్చొని మాట్లాడతానని కోరారు. దీనిపై ధన్‌ఖడ్‌ స్పందిస్తూ.. ‘‘సభలో ప్రసంగించేటప్పుడు మీరు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మీరు కూర్చొని మాట్లాడవచ్చు. ఆ నిర్ణయం మీదే’’ అని బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు