Assembly elections: జమ్మూకశ్మీర్‌ ఎన్నికలు అప్పుడేనా..?

అమర్‌నాథ్‌ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూకశ్మీర్‌ ఎన్నికలు నిర్వహించనున్నారని అధికారిక వర్గాల సమాచారం.

Updated : 05 Jul 2024 15:28 IST

దిల్లీ: అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra) ముగిసిన అనంతరం జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) నిర్వహించనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ రాష్ట్ర భాజపా (BJP) నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) ఆదేశించినట్లుగా సమాచారం. అమర్‌నాథ్‌ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది.

జమ్మూకశ్మీర్‌ ఎన్నికల్లో భాజపా 90 స్థానాల్లో పోటీ చేయనుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ప్రకటించినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.2018 నవంబర్‌లో రాష్ట్ర శాసనసభను రద్దు చేశారు. అనంతరం 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.

తాజాగా అధిష్ఠానంతో జరిగిన సమావేశానికి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రవీందర్‌ రైనా, పార్టీ ఎంపీలు జితేంద్ర సింగ్, జుగల్ కిషోర్ శర్మ ఇతర అగ్రనేతలు హాజరయ్యారు. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని భాజపా అధిష్ఠానం అన్నట్లు పార్టీ రాష్ట్ర వర్గాలు తెలిపాయి. అయితే భాజపా తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. త్వరలో పార్టీలోని ముఖ్యనేతలు రాష్ట్రంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని