Rahul Gandhi: పేపర్‌ లీక్‌లను ఆపలేరా?: మోదీపై రాహుల్‌ ధ్వజం

నీట్ పేపర్ లీక్, యూజీసీ నెట్ పరీక్ష రద్దు అంశాలు దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాల వేళ.. కేంద్రం ప్రభుత్వంపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. 

Published : 20 Jun 2024 17:32 IST

దిల్లీ: ఒకవైపు ‘నీట్‌- యూజీ ప్రవేశపరీక్ష 2024 (NEET UG-2024)’లో అవకతవకలు జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వస్తోన్న తరుణంలోనే.. అక్రమాలు జరిగాయన్న ప్రాథమిక ఆధారాలతో  యూజీసీ నెట్‌ జూన్‌-2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ వరుస పరిణామాలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మీడియాతో మాట్లాడారు.

‘‘దేశ విద్యావ్యవస్థపై కొందరి నియంత్రణ కారణంగానే ఈ పేపర్‌ లీక్‌లు జరుగుతున్నాయి. ఈ నియంత్రణకు మోదీజీ అవకాశం ఇచ్చారు. వైస్‌ ఛాన్సలర్ల నియామకాలు ప్రతిభ ఆధారంగా జరగడం లేదు. స్వతంత్ర విద్యావ్యవస్థ ధ్వంసమైంది. ఇలాంటి పరిణామాలకు కారకులైన వారికి శిక్ష పడాలి. ఈ పరిస్థితి మారనంత కాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇది దేశ వ్యతిరేక చర్య. ఈ అవకతవకలను మేం పార్లమెంట్‌లో లేవనెత్తుతాం’’ అని రాహుల్‌ వెల్లడించారు. అలాగే నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి క్లీన్‌ చిట్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. తాము ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నామో ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు.

అవును.. పరీక్షకు ముందురోజు రాత్రే నీట్ పేపర్‌ అందింది: అంగీకరించిన విద్యార్థులు

‘‘ఇప్పుడు మోదీ ప్రధాన ఎజెండా స్పీకర్ ఎన్నిక. ఆయన తన ప్రభుత్వం,  స్పీకర్ పదవి గురించి ఆలోచిస్తున్నారు. మోదీ ప్రజలను భయపెడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రజలు భయపడటం లేదు. ఈ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని వెల్లడిచేశాయి. వినయం, గౌరవం, రాజీ వంటి పదాలకు మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ గౌరవమిచ్చారు. నరేంద్రమోదీకి వాటిపై నమ్మకం లేదు’’ అని రాహుల్ దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే.. జూన్ 21న యోగా డే రోజున నీట్‌లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్(Congress) దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని