Karnataka News: కళాశాల వాష్‌రూంలో ప్రసవించిన ఇంటర్‌ విద్యార్థిని

ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని కళాశాల వాష్‌రూంలోనే ప్రసవించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కర్ణాటక పోలీసులు తెలిపిన మేరకు..  కోలారు నగర శివార్లలోని ఒక ప్రైవేటు కళాశాలలో బాలిక (17) పీయూసీ (ఇంటర్మీడియట్‌) మొదటి సంవత్సరం చదువుతున్నారు.

Published : 03 Jul 2024 03:24 IST

కోలారు, న్యూస్‌టుడే: ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని కళాశాల వాష్‌రూంలోనే ప్రసవించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కర్ణాటక పోలీసులు తెలిపిన మేరకు..  కోలారు నగర శివార్లలోని ఒక ప్రైవేటు కళాశాలలో బాలిక (17) పీయూసీ (ఇంటర్మీడియట్‌) మొదటి సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం తరగతి గదిలో ఉండగా పురుటి నొప్పులు రావడంతో వాష్‌రూంలోకి వెళ్లి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకుని కళాశాలలోని లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థులు నిర్ఘాంతపోయారు. ఆ బాలిక గర్భవతి అని ఇన్ని రోజులూ వారెవరూ గుర్తించలేకపోవడం గమనార్హం. బాలిక, నవజాత శిశువు క్షేమంగా ఉన్నారని స్థానిక ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కోలారు మహిళా ఠాణా పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని