Sanjana Thakur: భారతీయ రచయిత్రికి కామన్వెల్త్‌ బహుమతి

కామన్వెల్త్‌ కథానికల పోటీలో ముంబయికి చెందిన 26 ఏళ్ల సంజనా ఠాకుర్‌ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.

Published : 28 Jun 2024 06:03 IST

లండన్‌: కామన్వెల్త్‌ కథానికల పోటీలో ముంబయికి చెందిన 26 ఏళ్ల సంజనా ఠాకుర్‌ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఈ బహుమతి కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 7,359 మందిలో ఆమె ప్రథమురాలిగా నిలిచినట్లు గురువారం లండన్‌లో ప్రకటించారు. ఆమెకు 5,000 పౌండ్ల నగదు ప్రదానం చేస్తారు. సంజన కథకు శీర్షిక ‘ఐశ్వర్యా రాయ్‌’ కావడం విశేషం. ముంబయిలో ఇరుకైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న అవని అనే యువతి కథ అది. ఫలానావారు తనకు తల్లి అయిఉంటే ఎలా ఉంటుందని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఒక తల్లి పరిశుభ్రతకు అతిగా ప్రాధాన్యమిస్తే, మరో తల్లి.. బాలీవుడ్‌ నటి ఐశ్వర్యా రాయ్‌లా అందాల రాశి. ఆధునిక నగర జీవితంలో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న తీరుకు ఈ కథ అద్దం పడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని