దుబాయ్‌లో లక్కీడ్రా.. తెలుగువ్యక్తికి రూ.2.25కోట్లు క్యాష్‌ ప్రైజ్‌

Jackpot in Dubai: దుబాయ్‌లో నివసిస్తున్న ఓ తెలుగు వ్యక్తికి జాక్‌పాట్‌ తగిలింది. ఏకంగా రూ.2.25కోట్ల నగదు బహుమతి గెలుచుకున్నారు.

Published : 25 Jun 2024 18:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉపాధి కోసం అరబ్‌ దేశం యూఏఈ (UAE)లోని దుబాయ్‌ వెళ్లిన ఓ తెలుగు వ్యక్తికి అదృష్టం వరించింది. నెల నెలా తాను చేసిన పొదుపుతో ఏకంగా రూ.2.25 కోట్లు గెలుచుకున్నారు. సేవింగ్స్‌ స్కీమ్‌ చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా.. అందులో అతడు విజేతగా నిలిచారు.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు చెందిన బోరుగడ్డ నాగేంద్రమ్‌ (Nagendrum Borugadda) 2017లో యూఏఈ వెళ్లారు. దుబాయ్‌ (Dubai)లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఆయన 2019 నుంచి తాను సంపాదించిన దాంట్లో నుంచి ప్రతి నెలా 100 యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హమ్స్‌ను నేషనల్‌ బాండ్స్‌లో పొదుపు చేశారు. ఈ సేవింగ్ స్కీమ్‌ కట్టేవారికి రివార్డు ప్రోగ్రామ్‌ కింద లక్కీ డ్రా తీస్తారు.

గ్రాండ్‌ ప్రైజ్‌ కేటగిరీలో తీసిన లాటరీలో నాగేంద్రమ్‌ విజేతగా నిలిచారు. నగదు బహుమతి కింద 1 మిలియన్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హమ్స్‌ అందుకున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.25కోట్లకు పైమాటే. ఈ ప్రైజ్‌మనీపై ఆంధ్రా వాసి అంతులేని ఆనందం వ్యక్తం చేశారు. తన పిల్లల ఉన్నత చదువుల కల నెరవేరుతుందని, వారి భవిష్యత్తు భద్రంగా ఉంటుందని సంతోషపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని