ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం భారత్‌లో.. కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే!

దేశ రాజధాని దిల్లీలోని రైసినా హిల్ కాంప్లెక్స్‌ నార్త్, సౌత్ బ్లాక్‌లను 2025లో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ వెల్లడించారు.

Published : 30 Jun 2024 23:51 IST

జైపుర్‌: భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం చేస్తామని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ వెల్లడించారు. దేశ రాజధాని దిల్లీ (Delhi)లోని రైసినా హిల్ కాంప్లెక్స్‌ నార్త్, సౌత్ బ్లాక్‌లను 2025లో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్దదైన ఫ్రాన్స్‌లోని లూవ్‌ మ్యూజియం కంటే ఇది రెట్టింపు పరిమాణంలో ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో ఫ్రాన్స్, భారత్‌ల మధ్య ఓ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు.

కేదార్‌నాథ్‌లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్‌

‘‘సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక.. 2025లో ప్రభుత్వ కార్యాలయాలు అందులోకి మారిన తర్వాత.. రైసినా హిల్‌ నార్త్, సౌత్ బ్లాక్‌లను మ్యూజియంగా మార్చుతాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా నిలుస్తుంది. ఇది 5000 ఏళ్ల భారత చరిత్రను చెబుతుంది’’ అని ఆయన జోధ్‌పుర్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. వచ్చే నెలలో భారత్‌లో ‘ప్రపంచ వారసత్వ కమిటీ’ సమావేశాన్ని నిర్వహించనున్నామని, దేశంలో ఇదే మొదటిసారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని