Yogi Adityanath: రాజదండంపై ఎస్పీ వ్యాఖ్యలు.. మండిపడ్డ యోగి

పార్లమెంట్‌లో రాజదండం పెట్టడంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 27 Jun 2024 16:49 IST

దిల్లీ: పార్లమెంట్ నూతన భవనంలో స్పీకర్ కుర్చీ పక్కన రాజదండాన్ని (sceptre) ఏర్పాటు చేయడంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్‌కే చౌధరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) స్పందించారు. ‘‘సమాజ్‌వాదీ పార్టీ మన దేశ చరిత్ర, తమిళ సంస్కృతిని అగౌరవపరిచింది. ఇండియా కూటమికి భారతీయ చరిత్ర పట్ల ఏ మాత్రం గౌరవం లేదు. ఆ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. తమిళ సంస్కృతిపై కూటమి నేతలకు ఎంత ద్వేషముందో ఈ వ్యాఖ్యల ద్వారా అవగతం అవుతోంది. ‘రాజదండం’ భారత్‌కు గర్వకారణం. ఈ విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు’’ అని యోగి ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఆరోపించారు. 

పేపర్‌ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు: పార్లమెంట్‌ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఎస్పీకి చెందిన ఎంపీ ఆర్‌కే చౌధరి రాచరికానికి ప్రతీక సెంగోల్‌ను పార్లమెంట్‌లో పెట్టడాన్ని ప్రశ్నించారు. ‘‘రాజదండాన్ని సభ నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. దీనికి ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మద్దతిచ్చారు. దీనిపై తాజాగా స్పందించిన యోగి ఆదిత్యనాథ్‌ ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనికి డీఎంకే మద్దతిస్తుందా..?

మరోవైపు.. విపక్షాల తీరుపై భాజపా ధ్వజమెత్తింది. ‘‘పార్లమెంట్‌లో సెంగోల్‌ని ‘రాజ్‌ కా దండ్‌’ అని ఎస్పీ పిలుస్తోంది. అలా అయితే.. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నాడు రాజదండాన్ని ఎందుకు అందుకున్నారు. ప్రతిపక్షాలు తాజాగా సెంగోల్‌ అంశాన్ని తెర మీదకు తెస్తున్నాయి. ఇండియా కూటమి చేసిన ఈ అవమానానికి డీఎంకే మద్దతిస్తుందా?’’ అని కాషాయ పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని