Rahul Gandhi: నీట్‌పై చర్చకు ఇండియా కూటమి సిద్ధం: రాహుల్‌

నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ప్రతిపక్ష ఇండియా కూటమి సిద్ధంగా ఉందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Updated : 28 Jun 2024 19:56 IST

దిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌(Rahul Gandhi) గాంధీ విద్యార్థులనుద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు. నీట్‌(NEET) పరీక్షలో జరిగిన అవినీతిపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వంతో చర్చలు జరపడమే ఇండియా కూటమి లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో శాంతియుతంగా చర్చించడానికి విపక్ష నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. నేడు లోక్‌సభలో నీట్‌ విషయం మాట్లాడుతుండగా తన మైక్‌ను కట్‌ చేశారని మండిపడ్డారు.

‘‘నీట్‌ పేపర్ లీక్ గురించి అందరికీ తెలుసు. విద్యార్థులకు నష్టం కలిగించి, కొందరు మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా చదువుతుంటారు. పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టడం వారి కల. గురువారం విపక్షాల సమావేశంలో ఈ విషయం గురించి చర్చించాం. విద్యార్థుల సమస్యలపై వారి తరఫున పోరాడాలని నిర్ణయించాం’’ అని తెలిపారు. 

ఏడేళ్లలో 70సార్లు వివిధ పరీక్ష పత్రాలు లీక్‌ అయ్యాయని, దాని వల్ల రెండు కోట్ల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారని రాహుల్‌ అన్నారు. ఇవన్నీ చూస్తుంటే అవినీతి జరిగిందని స్పష్టంగా తెలుస్తోందన్నారు.  దీనికి పరిష్కారం చూపాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రధానిని కోరుతున్నా ఆయన మౌనం వీడట్లేదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు