IIT Bombay students: ‘రామాయణం’ స్కిట్‌తో జోకులు.. ఐఐటీ బాంబే విద్యార్థులకు రూ.1.20లక్షల ఫైన్‌

IIT Bombay students: రామాయణం ఆధారంగా నాటకం వేసిన బాంబే విద్యార్థులకు భారీ జరిమానా పడింది. ఒక్కో విద్యార్థి రూ.1.20లక్షలు చెల్లించాలని యాజమాన్యం ఆదేశించింది. అసలేం జరిగిందంటే..

Updated : 20 Jun 2024 17:29 IST

ముంబయి: ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే (IIT Bombay) విద్యాసంస్థలో కొందరు విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్‌ వివాదాస్పదమైంది. పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని అపహాస్యం చేసేలా వారు ప్రదర్శించిన నాటకం (Students Skit)పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ.1.20లక్షల చొప్పున జరిమానా విధించింది.

ఈ ఏడాది మార్చి నెలాఖరున ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్‌ ఫెస్టివల్ జరిగింది. ఇందులో కొందరు విద్యార్థులు ‘రాహోవన్‌ (Raahovan)’ పేరుతో ఓ నాటకాన్ని ప్రదర్శించారు. ‘రామాయణ’ ఇతిహాసం ఇతివృత్తంగా ఆ స్కిట్‌ వేశారు. అందులో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను నేరుగా ఉపయోగించనప్పటికీ.. అరణ్యవాసంలోని కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

తెల్ల రంగేశాడు.. పోలీసులకు దొరికేశాడు!

అయితే, అందులో విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉండటంతో ఆ స్కిట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పవిత్ర రామాయణాన్ని (Ramayan) కించపర్చారని, సంప్రదాయాలను మంట గలిపారని ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఐఐటీ బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణా కమిటీని ఏర్పాటుచేసి ఘటనపై దర్యాప్తు జరిపింది. అనంతరం నాటిక ప్రదర్శించిన విద్యార్థులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

స్కిట్‌ ప్రదర్శించినవారిలో గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు (IIT Bombay Students), జూనియర్లు ఉన్నారు. వీరిలో సీనియర్లకు ఒక్కొక్కరికీ రూ.1.2లక్షల చొప్పున జరిమానా విధించింది. అంతేగాక.. ఈ విద్యార్థులు జింఖానా అవార్డులు తీసుకునేందుకు అనర్హులని తెలిపింది. ఈ ఫైన్‌ వారి సెమిస్టర్‌ ఫీజుకు దాదాపు సమానం కావడం గమనార్హం. ఇక, జూనియర్లకు రూ.40వేలు చొప్పున జరిమానా వేయడంతో పాటు హాస్టల్‌ సదుపాయాలను పొందడంపై నిషేధం విధించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు