Haridwar: అనూహ్య వరద.. కొట్టుకుపోయిన కార్లు!

హరిద్వార్‌లోని సుఖీ నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో.. పలు కార్లు, బస్సులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

Published : 30 Jun 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ తీర్థక్షేత్రం హరిద్వార్‌ (Haridwar)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రధాన రహదారులు జలమయం కావడంతోపాటు ఇళ్లలోకి పెద్దఎత్తున వర్షపు నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. ఈ క్రమంలోనే స్థానికంగా సుఖీ నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో పలు కార్లు, బస్సులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్‌’.. భాజపా పోస్ట్‌ వైరల్‌

వర్షాధారమైన సుఖీ నది సాధారణంగా ఎండిపోయి కనిపిస్తుంది. నీళ్లు లేకపోవడంతో పలువురు ఎప్పటిలాగే తమ వాహనాలను అక్కడే పార్క్‌ చేశారు. అయితే.. కుండపోత వర్షంతో శనివారం నది ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించింది. దీంతో అక్కడున్న కార్లు, ఇతర వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ నది కొద్ది దూరంలో గంగాలో కలుస్తుంది. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ఎవరూ నదీ సమీపంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

దిల్లీలో 11 మంది మృతి.. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 11 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వసంత్‌విహార్‌లో ఓ గోడ కూలిన ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. నీళ్లు నిలిచిపోవడంతో ప్రగతి మైదాన్‌ టన్నెల్‌ను మూసి ఉంచారు. మరోవైపు.. దిల్లీ ఎల్జీ వీకే సక్సేనా క్షేత్రస్థాయిలో పర్యటించి వరద పరిస్థితులను పరిశీలించారు. మరో మూడు రోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణశాఖ అధికారులు.. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని