Bhole Baba: హాథ్రస్‌ తొక్కిసలాట.. భోలే బాబా ఏమన్నారంటే!

హాథ్రస్‌ దుర్ఘటన వెనక అసాంఘిక శక్తులు ఉన్నాయని ఆరోపిస్తూ భోలే బాబా ఓ ప్రకటన విడుదల చేశాడు.

Published : 04 Jul 2024 00:04 IST

హాథ్రస్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన జరిగిన ఒక రోజు అనంతరం భోలే బాబా స్పందించాడు. తాను ఆ వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఆ తొక్కిసలాట చోటుచేసుకుందన్నాడు. అంతేకాకుండా ఈ దుర్ఘటన వెనక అసాంఘిక శక్తులు ఉన్నాయని ఆరోపిస్తూ ఓ ప్రకటన విడుదల చేశాడు.

‘‘ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొంటూ నారాయణ్‌ సాకార్‌ హరి (భోలే బాబా) పేర్కొన్నారు. తాను వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాత ఈ ఘటన జరిగిందని భోలే బాబా చెబుతున్నప్పటికీ.. భక్తులను అతడి సెక్యూరిటీ సిబ్బంది తోసివేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నట్లు పేర్కొంది.

‘‘దాదాపు రెండున్నర లక్షల మంది ఈ ‘సత్సంగ్‌’కు హాజరయ్యారు. మధ్యాహ్నం 12.30కి బాబా వేదిక వద్దకు చేరుకున్నాడు. దాదాపు గంటపాటు ఆ కార్యక్రమం కొనసాగింది. 1.40గంటల ప్రాంతంలో భోలే బాబా బయటకు వచ్చాడు. వేదిక నుంచి వెళ్లే క్రమంలో దర్శనం కోసం భక్తులు ఆయన వెంట పరుగెత్తారు. ఆయన పాదాల వద్ద మట్టిని తీసుకునేందుకు ప్రయత్నించారు’’ అని జిల్లా అధికారులు దర్యాప్తులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని