Paper leaks: పేపర్‌ లీక్‌లను తీవ్రంగా పరిగణిస్తున్నాం - ప్రధాని మోదీ

నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ నిందితులను కఠినంగా శిక్షిస్తామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 02 Jul 2024 18:42 IST

దిల్లీ: పోటీ పరీక్షల్లో ప్రశ్నా పత్రాల లీకేజీల విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలో నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రసంగించిన మోదీ.. లీక్‌ ఘటనపై వేగంగా దర్యాప్తు జరుగుతోందన్నారు.

హిందువులపై ఆరోపణలా?

‘‘ఓబీసీ వర్గాలను కాంగ్రెస్.. దొంగలుగా చిత్రీకరిస్తోంది. వీర్‌ సావర్కర్‌పైనా ఆ పార్టీ నేతలు విమర్శలు చేశారు. భాషలు, వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారు. హిందువులపై దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. ఉగ్రవాదం అనే మాటను ప్రచారం చేస్తున్నారు. వారి మాటలు హిందువుల మనోభావాలను కించపరిచాయి’’ అని కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని.. వారి బాధను అర్థం చేసుకోగలనని ఎద్దేవా చేశారు. ప్రధాని మాట్లాడుతున్నంత సేపు ‘మణిపుర్‌.. మణిపుర్‌’ అంటూ నినాదాలు చేశారు. వారి నిరసన మధ్యే ప్రధాని ప్రసంగాన్ని కొనసాగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని