నీట్‌-యూజీని రద్దు చేయొద్దు

పరీక్ష పత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదమైన నీట్‌-యూజీ (2024)ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ అభ్యర్థనలను వ్యతిరేకిస్తూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Published : 05 Jul 2024 05:28 IST

సుప్రీంకోర్టును ఆశ్రయించిన 56 మంది విద్యార్థులు

దిల్లీ: పరీక్ష పత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదమైన నీట్‌-యూజీ (2024)ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ అభ్యర్థనలను వ్యతిరేకిస్తూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్‌-యూజీ (2024)లో అక్రమాలు జరిగినందున ఆ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ఇప్పటివరకు 26 పిటిషన్లు సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలయ్యాయి. వీటిపై ఈ నెల 8న సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్న నేపథ్యంలో తాజా పిటిషన్‌ దాఖలైంది. ‘‘పరీక్ష రద్దు చేయడం అనేది నిజాయతీగా, కష్టపడి చదివే విద్యార్థులకు ఎంతో నష్టం చేస్తుంది. విద్యాహక్కు ఉల్లంఘనకూ దారితీస్తుంది. అందుకే నీట్‌-యూజీని రద్దు చేయకుండా కేంద్రంతోపాటు ఎన్‌టీఏకు ఆదేశాలివ్వాలి’’ అని గుజరాత్‌కు చెందిన సిద్ధార్థ్‌ కోమల్‌ సింగ్లాతోపాటు మరో 55 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని