- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Health: రక్తంలో కొలెస్ట్రాల్‌పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులను (డిస్లిపిడెమియా) నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది.
దిల్లీ: రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులను (డిస్లిపిడెమియా) నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. రక్తంలో మొత్తంగా కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, ఎల్డీఎల్-కొలెస్ట్రాల్ (చెడు కొలెస్ట్రాల్) ఎక్కువవడం, ట్రైగ్లిసెరైడ్స్ అధికమవడం, హెచ్‌డీఎల్-కొలెస్ట్రాల్ (మంచి కొలెస్ట్రాల్) తక్కువవడం వంటివి డిస్లిపిడెమియా పరిధిలోకి వస్తాయి. గుండెపోటు, పక్షవాతం తదితర గుండె సంబంధిత వ్యాధులకు అది దారితీస్తుంటుంది. ఇది నిశ్శబ్ద హంతకిలాంటిదని సీఎస్ఐ అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్‌చంద్ర రథ్ తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల తరహాలో దీని లక్షణాలు ముందుగా బయటపడవని పేర్కొన్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ల స్థాయిలను నియంత్రణలో ఉంచుకునేందుకు తమ మార్గదర్శకాలు దోహదపడతాయని వివరించారు.
తాజా మార్గదర్శకాల ప్రకారం..
- గుండెజబ్బులు వంశపారంపర్యంగా వస్తున్న కుటుంబాలకు చెందినవారు, రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే (హైపర్కొలెస్టెరోలెమియా) కుటుంబాలకు చెందినవారు తొలి లిపిడ్ ప్రొఫైల్‌ను 18 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులోనే చేయించుకోవాలి.
- సాధారణ ప్రజలు, ముప్పు తక్కువగా ఉన్నవారు ఎల్డీఎల్-సీ స్థాయిలను 100 ఎంజీ/డీఎల్‌కు, నాన్-హెచ్‌డీఎల్-సీ స్థాయిలను 130 ఎంజీ/డీఎల్‌కు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
- ముప్పు ఎక్కువగా ఉన్న వ్యక్తులు (మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు) ఎల్డీఎల్-సీ స్థాయిలు 70 ఎంజీ/డీఎల్‌కు, నాన్-హెచ్‌డీఎల్-సీ స్థాయిలు 100 ఎంజీ/డీఎల్‌కు లోబడి ఉండేలా జాగ్రత్త పడాలి.
- ముప్పు అత్యధికంగా ఉన్నవారైతే (పక్షవాత బాధితులు, గుండెపోటు బారినపడ్డవారు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల బాధితులు) ఎల్డీఎల్-సీ స్థాయిలు 55 ఎంజీ/డీఎల్‌కు, నాన్-హెచ్‌డీఎల్-సీ స్థాయిలు 85 ఎంజీ/డీఎల్‌కు తక్కువగా ఉండేలా జాగ్రత్త వహించాలి.
- ఆహారంలో చక్కెర, కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకోవాలి.
- గుండె ఆరోగ్యాన్ని కాపాడే యోగా, వ్యాయామం వంటివి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
ఒడిశాలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్రను ఆదివారం నిర్వహించనున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా... -
శారీరకంగా దృఢంగా ఉన్నా: దలైలామా
తాను శారీరకంగా దృఢంగా ఉన్నానని.. బుద్ధుని బోధనల వ్యాప్తికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బౌద్ధ గురువు దలైలామా పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసుకొని కోలుకుంటున్నారు. -
పేపర్ లీక్ ఆరోపణలు.. ప్రిన్సిపల్‌ను కుర్చీలోంచి బయటకు లాగేసిన సిబ్బంది
పేపర్ లీక్ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఓ ప్రిన్సిపల్‌ను సిబ్బంది అంతా కలిసి బయటకు తోసేశారు. ఆమె ఫోన్ లాగేసుకొని, కుర్చీ నుంచి లేపి, బలవంతంగా బయటకు పంపారు. -
అనంత్, రాధికల సంగీత్ వేడుకలో.. జస్టిన్ బీబర్, బాలీవుడ్ తారల తళుకు
దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట అనంత్ - రాధికల ముందస్తు పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ‘సంగీత్’ కార్యక్రమంలో కెనడాకు చెందిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (30)తోపాటు బాలీవుడ్ తారలు సల్మాన్‌ఖాన్, రణవీర్ సింగ్, -
తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంకు సిద్ధం
తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంకు ‘జొరావర్’ సిద్ధమైంది. తాజాగా దీనిపై పరీక్షలు మొదలయ్యాయి. -
23న కేంద్ర బడ్జెట్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
సూరత్‌లో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం
గుజరాత్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ పట్టణంలోని పాల్ ప్రాంతంలో శనివారం ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల్లో పలువురు చిక్కుకుపోయారు. -
కేజ్రీవాల్‌పైనే దర్యాప్తు జరుగుతోంది
మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 15 వరకు న్యాయస్థానం పొడిగించింది. -
దోషులు శిక్ష నుంచి తప్పించుకోలేరు
హాథ్రస్ తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని వివాదాస్పద సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలే బాబా పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి అండగా ఉంటామని చెప్పారు. -
ఖరారు కాని నీట్ కౌన్సెలింగ్ షెడ్యూలు
వైద్యవిద్యకు సంబంధించిన 2024 నీట్ యూజీ, పీజీ కోర్సుల కౌన్సెలింగు షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఇంకా నోటిఫై చేయలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం స్పష్టం చేసింది. -
నలుగురు ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం
జమ్మూకశ్మీర్‌లో శనివారం రెండు వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఇద్దరు సైనికులూ ప్రాణాలు కోల్పోయారు. -
సంక్షిప్త వార్తలు
వ్యవసాయ మార్కెట్లలో అనధీకృత వ్యక్తులు వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగ్, మార్కింగ్ పనులు చేస్తే జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
సీసీటీవీల అవినీతి కేసులో మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌పై దర్యాప్తు
దేశ రాజధాని దిల్లీ నగరంలో సీసీటీవీల ఏర్పాటులో అవినీతి జరిగిందనే ఆరోపణలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌పై దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా అనుమతించారు. -
లోకోపైలట్లతో రాహుల్ భేటీపై వివాదం
రైల్వే డ్రైవర్ల (లోకోపైలట్ల)తో లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ భేటీఅయి వారి సమస్యలపై చర్చించడం కాస్త వివాదానికి తావిచ్చింది. కొత్తదిల్లీ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాహుల్‌తో మాట్లాడిన డ్రైవర్లంతా బయటివారేనని, -
హిమాచల్‌ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలో అత్యధికంగా 214.6మి.మీ వర్షపాతం నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
-
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
-
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
-
మణికొండలో కేవ్ పబ్‌పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు