సుప్రీంకు క్షమాపణ చెప్పిన ఐఎంయే అధ్యక్షుడు

పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంపై చేసిన వ్యాఖ్యలకు ‘భారత వైద్య సంఘం’ (ఐఎంయే) అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌.వి.అశోకన్‌ గురువారం బహిరంగ క్షమాపణ చెప్పారు.

Published : 05 Jul 2024 05:25 IST

దిల్లీ: పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంపై చేసిన వ్యాఖ్యలకు ‘భారత వైద్య సంఘం’ (ఐఎంయే) అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌.వి.అశోకన్‌ గురువారం బహిరంగ క్షమాపణ చెప్పారు. కోర్టుకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించినందుకు బేషరతు క్షమాపణ కోరుతూ ప్రమాణపత్రం దాఖలుచేశారు. పతంజలి కేసులో ఐఎంయే కూడా ఒక కక్షిదారుగా ఉంది. ‘తప్పుడు పద్ధతులు అవలంబిస్తున్న తీరుపై మా సంస్థకూ ఆందోళన ఉంది. సుప్రీంకోర్టు గౌరవానికి భంగం కలిగించాలన్న ఉద్దేశం నాకు ఎన్నడూ లేదు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తాజాపర్చడం, నైతిక అభ్యాసాలను ప్రోత్సహించడం మా ప్రధాన కార్యకలాపాల్లో ఒకటి’ అని డాక్టర్‌ అశోకన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని