కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Published : 05 Jul 2024 05:24 IST

కోటా: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాది కోటాలో మరణించిన విద్యార్థుల సంఖ్య 13కు చేరింది. మృతుడిని బిహార్‌లోని నలంద జిల్లాకు చెందిన సందీప్‌ కుమార్‌ కుర్మీ(16)గా గుర్తించారు. మహావీర్‌ నగర్‌లో తాను అద్దెకుంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం 7 గంటలకు కుర్మీని అతడి స్నేహితుడు పిలిచినా స్పందించలేదు. దీంతో కిటికీలో నుంచి చూడగా కుర్మీ విగతజీవిగా కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. గదిలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదని పేర్కొన్నారు. ఆత్మహత్యలను నిరోధించేందుకు స్థానిక యంత్రాంగం నిర్దేశించిన మార్గదర్శకాలను హాస్టల్‌ యజమాని పాటించలేదని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని