8 నుంచి మోదీ రష్యా పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8-10 తేదీల్లో ఆయన రష్యాతోపాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ప్రకటించింది.

Published : 05 Jul 2024 05:24 IST

22వ భారత్‌-రష్యా వార్షిక సమావేశంలో పాల్గొననున్న ప్రధాని
అటు నుంచి ఆస్ట్రియాకూ..

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8-10 తేదీల్లో ఆయన రష్యాతోపాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ప్రకటించింది. గత అయిదేళ్లలో ప్రధాని మోదీకి రష్యా పర్యటన ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత మాస్కోను సందర్శించనుండటం ఇదే మొదటిసారి. అదేవిధంగా.. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే ప్రథమం. ‘‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ నెల 8, 9 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. 22వ భారత్‌- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మోదీ ఆస్ట్రియాను సందర్శించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌ డెర్‌ బెలెన్, ఛాన్సలర్‌ కర్ల్‌ నెహమెర్‌లతో చర్చలు జరుపుతారు’’ అని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని