బిహార్‌లో కూలిన మరో వంతెన

బిహార్‌లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. గురువారం సారణ్‌ జిల్లాలోని గండకీ నదిపై మరో వంతెన కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

Published : 05 Jul 2024 05:22 IST

గత 16 రోజుల్లో ఇది పదోది

పట్నా: బిహార్‌లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. గురువారం సారణ్‌ జిల్లాలోని గండకీ నదిపై మరో వంతెన కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో సారణ్‌ జిల్లాలో కూలిన మూడో వంతెనిది. మొత్తంమీద బిహార్‌లో గత 16 రోజుల్లో 10 వంతెనలు కుప్పకూలాయి. సారణ్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ అమన్‌ సమీర్‌ కథనం ప్రకారం.. కూలిన వంతెన బనియాపుర్‌ బ్లాక్‌కు చెందినది. ఇది సారణ్‌లోని చాలా గ్రామాలను పొరుగున ఉన్న సివాన్‌ జిల్లాతో కలుపుతుంది. 15 ఏళ్ల క్రితం దీన్ని నిర్మించారు. సివాన్, సారణ్, మధుబని, అరరియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్‌ జిల్లాల్లో గత 16 రోజుల్లో 10 బ్రిడ్జిలు కుప్పకూలాయి. మరోవైపు ఈ వరుస ఘటనలపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని