మోదీ తండ్రిపై వ్యాఖ్యలు.. ఖేడా సమీక్ష పిటిషన్‌ కొట్టివేత

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడా దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది.

Published : 05 Jul 2024 05:03 IST

లఖ్‌నవూ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడా దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. తనకు క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు లఖ్‌నవూలోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ నిరాకరించడంపై పునఃసమీక్ష జరపాలని ఎంపీ/ ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానాన్ని ఖేడా కోరారు. ప్రధాని తండ్రి దామోదర్‌దాస్‌ మూల్‌చంద్‌ మోదీ పేరును ‘నరేంద్ర గౌతమ్‌ దాస్‌ మోదీ’గా ఖేడా చెప్పడంపై వారణాసి, లఖ్‌నవూ, అస్సాంలలో వేర్వేరుగా కేసులు దాఖలయ్యాయి. వీటిని ఖేడా సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. అన్ని కేసులనూ హజ్రత్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌కు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కేసులను, ఛార్జిషీటును కొట్టివేయాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో ఖేడా దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగులో ఉండడం వల్ల తామెలాంటి ఉపశమనం ఇవ్వలేమని ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని