మీ మానసిక పరిస్థితి బాగానే ఉందా!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జ్యోతిరాదిత్య సింధియా 2018లో తాను పైలట్‌గా ఉన్న ఎయిరిండియా విమానం కూల్చివేసి, జాతీయ భద్రతను అస్థిరపరచాలని ప్రయత్నించినట్లు కెప్టెన్‌ దీపక్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.

Published : 04 Jul 2024 04:24 IST

ప్రధాని మోదీని లోక్‌సభ నుంచి డిబార్‌ చేయాలన్న పిటిషన్‌ కొట్టివేస్తూ దిల్లీ హైకోర్టు ప్రశ్న 

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జ్యోతిరాదిత్య సింధియా 2018లో తాను పైలట్‌గా ఉన్న ఎయిరిండియా విమానం కూల్చివేసి, జాతీయ భద్రతను అస్థిరపరచాలని ప్రయత్నించినట్లు కెప్టెన్‌ దీపక్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. పిటిషనులోని ఆరోపణలన్నీ ఊహాత్మకంగా ఉన్నట్లు పేర్కొన్న తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ మన్మోహన్, జస్టిస్‌ తుషార్‌రావుల ధర్మాసనం ఇంతకుమునుపు ఈ పిటిషన్‌ను కొట్టివేసిన సింగిల్‌ జడ్జి అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. ‘‘మీ మానసిక పరిస్థితి బాగానే ఉందా! వైద్యసాయం ఏమైనా అవసరమా?’’ అని పిటిషనరును న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యసాయం అవసరం లేదంటూ పిటిషనరు కోర్టులో తన వాదన వినిపించారు. తీర్పు కాపీని దీపక్‌ నివసించే ప్రాంత పోలీసు అధికారికి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించిన ధర్మాసనం.. ఆయన కదలికలపై నిఘా ఉంచి అవసరమైతే వారి విచక్షణాధికారాలను ఉపయోగించుకోవాలని స్థానిక అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని