కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై 5న హైకోర్టులో విచారణ

మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ మోపిన అవినీతి కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు ఈ నెల 5న విచారణ జరపనుంది.

Published : 04 Jul 2024 04:24 IST

దిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ మోపిన అవినీతి కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు ఈ నెల 5న విచారణ జరపనుంది. బెయిల్‌ అభ్యర్థన విషయాన్ని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది బుధవారం దిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్, జస్టిస్‌ తుషార్‌రావు ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేజ్రీవాల్‌ను అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని, గురువారమే దీనిపై విచారణ జరపాలని న్యాయవాది రజత్‌ భరద్వాజ్‌ విజ్ఞప్తి చేశారు. స్పందించిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారణకు చేపడతామని పేర్కొంది. 

12 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

మద్యం కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీని బుధవారం ట్రయల్‌ కోర్టు ఈ నెల 12 వరకు పొడిగించింది. ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని