దేశాల సమన్వయంతోనే గ్రహాల రక్షణ వ్యవస్థ: ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌

అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్‌) నుంచి భూమి సహా ఇతర గ్రహాలను రక్షించే వ్యవస్థను ఏ దేశమూ ఒంటరిగా రూపొందించలేదని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు.

Published : 04 Jul 2024 04:05 IST

ఈనాడు, బెంగళూరు: అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్‌) నుంచి భూమి సహా ఇతర గ్రహాలను రక్షించే వ్యవస్థను ఏ దేశమూ ఒంటరిగా రూపొందించలేదని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. ఆయన బుధవారం బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో ఇంటర్నేషనల్‌ ఆస్టరాయిడ్‌ డే సందర్భంగా గ్రహాల రక్షణపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ‘భూమితో పాటు అంతరిక్షానికి గ్రహశకలాల నుంచి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది. వాటిని నియంత్రించే రక్షణ వ్యవస్థలు తయారు చేయడం దేశాల మధ్య సమన్వయంతోనే సాధ్యం. ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్లోబల్‌ మిషన్‌లో భారత్‌ ఓ భాగస్వామి. ఇందులో భాగంగానే 2029లో గ్రహశకలాల అధ్యయన మిషన్‌ అపోఫిస్‌- 2029లో పాల్గొంటున్నాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని