తొక్కిసలాట.. విషాదాలు

దేశంలో మతపరమైన కార్యక్రమాలు, ఇతర సందర్భాల్లోనూ పలుమార్లు తొక్కిసలాటలు చోటుచేసుకున్నాయి. అలాంటి ఘటనల్లో భారీ ఎత్తున భక్తులు, సామాన్యులు దుర్మరణం పాలయ్యారు.

Published : 03 Jul 2024 05:05 IST

దిల్లీ: దేశంలో మతపరమైన కార్యక్రమాలు, ఇతర సందర్భాల్లోనూ పలుమార్లు తొక్కిసలాటలు చోటుచేసుకున్నాయి. అలాంటి ఘటనల్లో భారీ ఎత్తున భక్తులు, సామాన్యులు దుర్మరణం పాలయ్యారు. అటువంటి విషాద దుర్ఘటనల వివరాలు..

  • 2005: మహారాష్ట్రలోని మంధర్‌దేవీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు.
  • 2008: రాజస్థాన్‌లోని చాముండా దేవీ దేవాలయంలో 250 మంది మృతి చెందారు.
  • 2008: హిమాచల్‌ప్రదేశ్‌లోని నైనా దేవీ కోవెలలో 162 మంది అసువులు బాశారు.
  • 2010, మార్చి 4: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో కృపాల్‌ మహరాజ్‌కు చెందిన సీతారాముల మందిరం వద్ద ఉచితంగా అందించే దుస్తులు, ఆహారం తీసుకోవడానికి జనం ఒక్కసారిగా వచ్చిన సందర్భంగా జరిగిన తోపులాటలో 63 మంది మృతి చెందారు.
  • 2011, జనవరి 14: కేరళలోని ఇడుక్కి జిల్లా పుల్‌మేడు వద్ద ఓ జీపు ప్రమాదానికి గురైన సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 104 మంది అయ్యప్పస్వామి భక్తులు దుర్మరణం పాలయ్యారు. 
  • 2013, అక్టోబరు 13: మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో రత్నగఢ్‌ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తోపులాటలో 115 మంది అసువులు బాశారు.
  • 2014, అక్టోబరు 03: బిహార్‌లోని పట్నాలో గల గాంధీ మైదాన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 32 మంది మరణించారు. 
  • 2022, జనవరి 01: జమ్మూకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది భక్తులు చనిపోయారు.
  • 2023, మార్చి 31: మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో బావి కూలి 36 మంది మృతి చెందారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని