ఆ గ్రామం నుంచి వైద్య కళాశాలకు 108 మృతదేహాల వితరణ

మరణానంతరం అవయవదానం చేసేందుకు ముందుకువస్తున్న దాతలను చాలామందిని చూశాం. దేహంలో ఏదో ఒక భాగాన్ని కాకుండా మొత్తం శరీరాన్ని దానం చేయడం ద్వారా కర్ణాటకలోని ఆ గ్రామ ప్రజలు ఆదర్శప్రాయులుగా నిలిచారు.

Published : 03 Jul 2024 05:03 IST

మరో 185 మంది సంసిద్ధత

రణానంతరం అవయవదానం చేసేందుకు ముందుకువస్తున్న దాతలను చాలామందిని చూశాం. దేహంలో ఏదో ఒక భాగాన్ని కాకుండా మొత్తం శరీరాన్ని దానం చేయడం ద్వారా కర్ణాటకలోని ఆ గ్రామ ప్రజలు ఆదర్శప్రాయులుగా నిలిచారు. బెళగావి జిల్లాలోని షేగుణసి గ్రామస్థులు తమ ఆత్మీయులు చనిపోయాక దహన సంస్కారాలు చేయకుండా ఇప్పటికే 108 మృతదేహాలను వైద్య కళాశాలకు అందించారు. గ్రామంలోని మరో 185 మంది ఇలా దేహ దానానికి తమ అంగీకారాన్ని తెలిపారు. కులం, మతం వంటి పట్టింపులు లేకుండా గ్రామంలో ఎవరు చనిపోయినా ముందుగా మృతదేహాలకు పూజలు చేసి, వైద్య కళాశాలకు అప్పగిస్తామని గ్రామస్థుడు సిద్ధన్న తెలిపారు. చనిపోయినా మరొకరికి ఉపయోగపడాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. 2010లో ఈ గ్రామాన్ని సందర్శించిన డాక్టర్‌ మహంతేశ్‌ రామన్నవర్‌ మృతదేహాల దానం గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అప్పటికప్పుడు వంద మందికి పైగా ముందుకు వచ్చి తమ మృతదేహాలను ఇచ్చేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని సిద్ధన్న చెప్పారు. దేశంలో మృతదేహాల దానానికి అత్యధికంగా దాతలు పేర్లు నమోదు చేసుకున్న గ్రామం షేగుణసి అని డాక్టర్‌ మహంతేశ్‌ రామన్నవర్‌ తెలిపారు.

ఈటీవీ భారత్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని