కొత్త నేర చట్టాలపై నో కామెంట్‌

రెండ్రోజుల క్రితం అమలులోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలపై దేశవ్యాప్తంగా వాడీవేడి చర్చ జరుగుతుండగా వాటిపై వ్యాఖ్యానించేందుకు  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నిరాకరించారు.

Published : 03 Jul 2024 04:59 IST

సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌

దిల్లీ: రెండ్రోజుల క్రితం అమలులోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలపై దేశవ్యాప్తంగా వాడీవేడి చర్చ జరుగుతుండగా వాటిపై వ్యాఖ్యానించేందుకు  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నిరాకరించారు. ట్రయల్‌ కోర్టు భవనాలకు దిల్లీలోని కడ్‌కడ్‌డూమాలో మంగళవారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... ఈ చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని, న్యాయస్థానం పరిధిలోని అంశాలపై మాట్లాడడం తగదని ఆయన తెలిపారు. అనంతరం ప్రసంగిస్తూ...మన న్యాయస్థానాలు సార్వభౌమాధికారాన్ని చాటే ప్రదేశాలు మాత్రమే కాదని అత్యవసరమైన ప్రజాసేవలను అందించే కేంద్రాలని తెలిపారు. కోర్టు ప్రాంగణాలు చట్ట పాలనకు, న్యాయ వివేచన వికాసానికి నిలయాలని పేర్కొన్నారు. కోర్టు ముందుకొచ్చే ప్రతి కేసూ న్యాయం జరుగుతుందనే ఆశతోనే వస్తుందన్నారు. న్యాయస్థానాలు రాజ్యాంగాన్ని మినహా మరే అధికారాన్నీ శిరసావహించవనీ, పిటిషనర్లకు తప్ప మరెవరికీ సేవలు అందించవన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని