బద్రీనాథ్‌లో అలకనందకు వరద

ఉత్తరాఖండ్‌లోని అలకనంద నది తీరంలో జరుగుతున్న తవ్వకాలు బద్రీనాథ్‌లో వరదలకు దారితీశాయి. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 వరకు జరిగిన ఈ పరిణామంతో భక్తులు,

Published : 03 Jul 2024 04:57 IST

గోపేశ్వర్‌: ఉత్తరాఖండ్‌లోని అలకనంద నది తీరంలో జరుగుతున్న తవ్వకాలు బద్రీనాథ్‌లో వరదలకు దారితీశాయి. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 వరకు జరిగిన ఈ పరిణామంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ వరద ధాటికి బ్రహ్మకపాల్‌ మునిగిపోగా.. బద్రీనాథ్‌ ప్రధాన ఆలయ సమీపంలో ఉండే తప్త్‌కుండ్‌ వరకు వరద చేరింది. మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా బద్రీనాథ్‌లో అధికారులు చేపడుతున్న తవ్వకాలే ఈ వరదలకు కారణమని స్థానికులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని