అస్సాంను ముంచెత్తుతున్న వరదలు

అస్సాంలో వరదల పరిస్థితి మంగళవారం నాటికి మరింత తీవ్రంగా మారింది. మరో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడగా, రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లోని 11.34 లక్షలమంది బాధితులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 03 Jul 2024 04:54 IST

గువాహటి: అస్సాంలో వరదల పరిస్థితి మంగళవారం నాటికి మరింత తీవ్రంగా మారింది. మరో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడగా, రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లోని 11.34 లక్షలమంది బాధితులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది వరదలు, కొండ చరియలు విరిగిపడటం, తుపానుల కారణంగా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 48కి చేరింది. లఖింపుర్, దరంగ్, గోలాఘాట్‌ జిల్లాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. 489 సహాయక శిబిరాలు, రేషను పంపిణీ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2,850 మంది ప్రజలను సహాయక బృందాలు కాపాడాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదస్థాయిని దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో దిబ్రూగఢ్‌ జిల్లా పరిస్థితి దారుణంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. కాజీరంగా నేషనల్‌ పార్కులోకి నీరు చేరి నాలుగు జింకలు నీటమునిగి మృతిచెందగా, 24 ఇతర జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని