మతమార్పిళ్లు జరిగే సమ్మేళనాలను నిలిపివేయాలి

మత మార్పిళ్లపై అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిళ్లు జరుగుతున్న సమ్మేళనాలను వెంటనే నిలిపివేయాలని అభిప్రాయపడింది.

Published : 03 Jul 2024 04:51 IST

అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్య

ప్రయాగ్‌రాజ్‌: మత మార్పిళ్లపై అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిళ్లు జరుగుతున్న సమ్మేళనాలను వెంటనే నిలిపివేయాలని అభిప్రాయపడింది. అలా చేయకుంటే దేశంలోని మెజారిటీ ప్రజలు మైనారిటీలుగా మారే రోజు త్వరలోనే వస్తుందని పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక గ్రామంలో పలువురిని మతం మారేలా చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న కైలాశ్‌ అనే వ్యక్తి బెయిల్‌ దరఖాస్తును తిరస్కరిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రచారం చేసుకోవడం అంటే వ్యక్తులను ఒక మతం నుంచి మరో మతానికి మారేలా చేయడం కాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని