కేజ్రీవాల్‌ పిటిషన్‌పై వారంలోగా స్పందించండి

అక్రమాస్తుల కేసును సవాల్‌ చేస్తూ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏడు రోజుల్లోగా స్పందించాలని సీబీఐని జస్టిస్‌ నీనా బన్సల్‌ కృష్ణ ఆదేశించారు.

Published : 03 Jul 2024 03:47 IST

సీబీఐకి దిల్లీ హైకోర్టు ఆదేశం

దిల్లీ: అక్రమాస్తుల కేసును సవాల్‌ చేస్తూ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏడు రోజుల్లోగా స్పందించాలని సీబీఐని జస్టిస్‌ నీనా బన్సల్‌ కృష్ణ ఆదేశించారు. మద్యం కుంభకోణంలో ఈడీ దాఖలు చేసిన మనీ ల్యాండరింగ్‌ కేసు కారణంగా జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎంని... సీబీఐ జూన్‌ 26న తిహాడ్‌ జైలులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి, జులై 12 వరకు జ్యుడిషియల్‌ కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. మరోవైపు.. మద్యం కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తారని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి మంగళవారం హైకోర్టుకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని