తొలి పరిభ్రమణాన్ని పూర్తిచేసుకున్న ఆదిత్య-ఎల్‌1

సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్‌ ప్రయోగించిన తొలి వ్యోమనౌక ఆదిత్య-ఎల్‌1 మంగళవారం విజయవంతంగా ఒక పరిభ్రమణను పూర్తిచేసుకుంది. సూర్యుడు-భూమి వ్యవస్థలోని ఎల్‌1 బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ చేసింది.

Published : 03 Jul 2024 03:42 IST

బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్‌ ప్రయోగించిన తొలి వ్యోమనౌక ఆదిత్య-ఎల్‌1 మంగళవారం విజయవంతంగా ఒక పరిభ్రమణను పూర్తిచేసుకుంది. సూర్యుడు-భూమి వ్యవస్థలోని ఎల్‌1 బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ చేసింది.

ఆదిత్య-ఎల్‌1ను గత ఏడాది సెప్టెంబరు 2న ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 6న అది ఎల్‌1 కక్ష్యలోకి ప్రవేశించింది. అక్కడ ఒక పరిభ్రమణం పూర్తికావడానికి 178 రోజులు పడుతుంది. ఈ కక్ష్యలో తిరిగేటప్పుడు రోదసిలోని వివిధ రకాల బలాలు వ్యోమనౌకపై పనిచేస్తాయి. ఫలితంగా దాని లక్షిత ప్రయాణ మార్గంలో వైరుధ్యాలు తలెత్తుతుంటాయి. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరి 22న, జూన్‌ 7న ఆదిత్య-ఎల్‌1 గమనంలో అవసరమైన సర్దుబాట్లు ఇస్రో శాస్త్రవేత్తలు  చేయాల్సి వచ్చింది. మంగళవారం మూడోసారి ఈ కసరత్తును నిర్వహించారు. రెండో కక్ష్యలో దాని ప్రయాణం కొనసాగేలా చూడటం దీని ఉద్దేశం.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని