అరుణాచల్‌ప్రదేశ్‌లో సరికొత్త కప్ప జాతి

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని టేల్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక సరికొత్త కప్ప జాతిని భారత జంతు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని తలపై కొమ్ముల్లాంటి ఆకృతులు ఉన్నాయని వారు వివరించారు.

Published : 03 Jul 2024 05:23 IST

షిల్లాంగ్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని టేల్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక సరికొత్త కప్ప జాతిని భారత జంతు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని తలపై కొమ్ముల్లాంటి ఆకృతులు ఉన్నాయని వారు వివరించారు. దీన్ని తొలుత.. వియత్నాం, చైనాలో ఎక్కువగా కనిపించే జెనోపైరిస్‌ మాసోనెన్సిస్‌ అనే కప్ప జాతిగా భావించామని తెలిపారు. అయితే రెండింటి మధ్య జన్యుపరంగా చాలా వైరుధ్యాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని