స్వచ్ఛంద సంస్థల రెన్యువల్‌ చెల్లుబాటు గడువు పెంపు

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌యే) కింద నమోదైన అన్ని  స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) చెల్లుబాటు గడువును మరోసారి పెంచుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Published : 02 Jul 2024 05:38 IST

దిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌యే) కింద నమోదైన అన్ని  స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) చెల్లుబాటు గడువును మరోసారి పెంచుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పునరుద్ధరణ (రెన్యువల్‌) కోసం దరఖాస్తు చేసుకుని అవి పెండింగులో ఉన్న ఎన్జీవోలకు ఈ గడువు సెప్టెంబరు 30వ తేదీగా ఉంటుందని తెలిపింది. గతంలో దీనిని జూన్‌ 30 వరకు పెంచారు. అది ముగిసిపోవడంతో మళ్లీ పెంచారు. సోమవారం (జులై ఒకటో తేదీ) నుంచి సెప్టెంబరు 30 మధ్య ఐదేళ్ల చెల్లుబాటు గడువు ముగుస్తున్న అన్ని ఎన్జీవోలకు కూడా ఇది వర్తిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. నిర్ణీత తేదీలోగా దరఖాస్తు చేసిన, చేయబోతున్న సంస్థలకు ఇది అమలవుతుందని పేర్కొంది. పునరుద్ధరణ దరఖాస్తు ఒకవేళ తిరస్కరణకు గురైతే ఆయా సంఘాలు అదేరోజు నుంచి చెల్లుబాటుకావని, విదేశీ విరాళాలు స్వీకరించడానికి, వాటిని ఖర్చుచేయడానికి అవి అనర్హం అవుతాయని కేంద్రం స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని